ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన పలు సైనిక విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ విషయంపై మరింత చర్చకు దారి తీసింది.ఆ వీడియోలో అమెరికా వైమానిక దళానికి చెందిన KC-135 Stratotanker విమానం యూకేలోని RAF Mildenhall మీదుగా ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం పైభాగంలో మరమ్మతుల గుర్తులు, దెబ్బతిన్న భాగాలు స్పష్టంగా కనిపించడంతో ఇది ఇరాన్ దాడుల్లో నష్టపోయిన విమానాల్లో ఒకటై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీడియోను యూకేకు చెందిన ఏవియేషన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కెల్వీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాడుల్లో పలు విమానాలు ధ్వంసమయ్యాయా?
గత నెలలో సౌదీ అరేబియాలోని ఒక వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిందని, ఆ దాడుల్లో ఐదు KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని నివేదికలు చెబుతున్నాయి.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన సుమారు 39 విమానాలు ధ్వంసమైనట్లు, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అవలో A-10, F-15E స్ట్రైక్ ఈగల్ వంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, అమెరికా అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం F-35 Lightning II కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మరమ్మతులు, తిరిగి వినియోగంపై అనుమానాలు
దెబ్బతిన్న విమానాలను తిరిగి సేవలోకి తీసుకురావడానికి అమెరికా మరమ్మతులు చేపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ ఎంతవరకు విజయవంతమవుతుందన్నది ఇంకా స్పష్టత లేదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















