కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో మినీ ట్రక్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, 12 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కర్ణాటక రాష్ట్రం హాసన, చిక్కమగళూరు జిల్లాలకు చెందిన 22 మంది రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి బయలుదేరారు. వీరంతా వ్యవసాయ కూలీలు కాగా, మినీ ట్రక్‌లో ప్రయాణిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున సుమారు 3.15 గంటల సమయంలో చిలకలడోణ వద్ద డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని తప్పుదిశలో నడపడంతో ఎదురుగా వస్తున్న ఫ్లైయాష్ లారీని బలంగా ఢీకొట్టారు.
ధాటికి మినీ ట్రక్ బోల్తా పడి పూర్తిగా ధ్వంసమైంది. లారీ కూడా రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సునీల్ (25)తో పాటు మరికొందరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ఆసుపత్రికి, అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వారిలో మరికొందరు చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మిగిలిన బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి గురైన వాహనం సరుకు రవాణాకు మాత్రమే అనుమతించబడినప్పటికీ, దానిని ప్రయాణికుల రవాణాకు వినియోగించడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. వాహన తొట్టెలోపాటు పైభాగంలోనూ ప్రయాణికులను కూర్చోబెట్టినట్లు సమాచారం.ఈ ఘటనపై గవర్నర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















