హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలపై అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనం నేపథ్యంలో పరిస్థితి తీవ్రతరం అవుతోందిఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 21 నౌకలను వెనక్కి పంపించారు. తమ ఆదేశాలను పాటిస్తూ ఈ నౌకలు తిరిగి వెళ్లినట్లు తెలిపారు.
అమెరికాకు చెందిన USS Michael Murphy అనే యుద్ధనౌక అరేబియా సముద్రంలో గస్తీ కాస్తూ, ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే లేదా బయటకు వచ్చే నౌకలను అడ్డుకుంటోంది. ఈ చర్యలు సముద్ర భద్రత కోసం చేపడుతున్నవని అమెరికా చెబుతోంది.
ఇదిలా ఉండగా Strait of Hormuz ను పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయాన్ని Donald Trump స్వాగతించినప్పటికీ, ఇరాన్ నౌకలపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















