హర్మూజ్ జలసంధి పరిణామాలపై ఇరాన్ – అమెరికా మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. Donald Trump చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు టెహ్రాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొంటూ, ఇది ప్రపంచానికి గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఘాటుగా స్పందించింది. అతిగా ఆనందం వ్యక్తం చేయొద్దని, హుందాగా ఉండాలని ట్రంప్‌కు సూచించింది.
ఇంకా ముందుకెళ్లి, ఫోన్ పక్కనపెట్టి విశ్రాంతి తీసుకోవాలని, Benjamin Netanyahu (బీబీ)ని కొన్ని రోజులు బ్లాక్ చేయాలని సెటైర్లు వేసింది. ఇరాన్‌లో పాలన మార్పు లేదా హర్మూజ్‌పై ఊహాగానాలను వదులుకోవాలని, తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది.Strait of Hormuz అంశంపై ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబులు పడతాయని ట్రంప్ హెచ్చరించారు. త్వరితగతిన ఒప్పందానికి రావాలని ఆయన సూచించారు.మొత్తంగా, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉండగా, ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచే సూచనలు ఇస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















