పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను (John Phelan) పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సైనిక విభాగంలో జరిగిన తొలి పెద్ద మార్పు ఇదే కావడం గమనార్హం. ఫెలాన్ తొలగింపుకు గల అసలు కారణాలను వైట్ హౌస్ వెల్లడించలేదు.
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫెలాన్ గతంలో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధ చర్యల్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ఇదే సమయంలో యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవలే ఉన్నత సైనికాధికారి జనరల్ రాండీ జార్జ్‌ను కూడా తొలగించారు. వరుసగా ఉన్నత స్థాయి సైనిక అధికారులపై చర్యలు తీసుకోవడం అమెరికా రక్షణ వ్యవస్థలో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.ప్రస్తుతం అమెరికా నావికాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు పశ్చిమాసియాలో మోహరించి ఉన్నాయి. కాల్పుల విరమణ గడువు ముగిస్తే ఇరాన్‌పై మళ్లీ చర్యలు చేపడతామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















