దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . చమురు భగభగలు, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో మన సూచీలు నష్టాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్ 400 పాయింట్ల మేర నష్టపోయింది.
ఉదయం సెన్సెక్స్ 77,094 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 77,493 పాయింట్ల గరిష్ఠానికి.. 76,741 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 416 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి, 23,995 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 41 పైసలు కోల్పోయి, చివరకు 94.56కు చేరింది. నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా, రిలయన్స్, నెస్లే షేర్లు రాణించగా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టపోయాయి.
కారణాలివీ..
వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత, సోమవారం దేశీయ సూచీలు లాభాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నేటి ట్రేడింగ్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ షేర్లు నష్టపోయాయి. మరోపక్క చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 110 డాలర్లు దాటింది. విదేశీ సంస్థాగత మదుపర్లు తమ వాటాలను విక్రయించడమూ, మంగళవారమే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కావడమూనష్టాలకు కారణాలని తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















