హమ్మయ్యా..! ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి.. ఇక రోజూ ఇంట్లో ఆటలే ఆటలు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా ఫ్రెండ్స్.. మీ ఛోటూని! లాస్ట్ ఇయర్ వేసవి సెలవుల్లో బోలెడు కబుర్లు చెప్పుకొన్నాం కదా!. ఇప్పుడు కూడా వారానికోసారి సరదాగా మాట్లాడుకుందాం.
ఈసారి సెలవుల్లో నేను చేయాల్సినవి ముందే పెద్ద లిస్ట్ రాసి పెట్టుకున్నాను. కానీ మీకు ఇప్పుడే చూపెట్టనుగా! మెల్లమెల్లగా ఒక్కోటి చెబుతుంటాను. నన్ను ఫాలో అవ్వండేం. మీరేం చేస్తున్నారో కూడా నాకు చెబుతూ ఉండండి. మరి మీ నుంచి నేనూ నేర్చుకోవాలి కదా. నేను ముందు అయితే అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాను. రోజంతా కచ్చితంగా ఏదో ఒక ఆట ఆడుకుంటూనే ఉంటాను. ఎలాగూ వారం రోజులు అక్కడే ఉంటాను కాబట్టి.. రోజూ తాతయ్య, అమ్మమ్మలను గమనిస్తుంటాను. తిరిగి వచ్చే ముందు వాళ్లతో విడిగా మాట్లాడదాం అనుకుంటున్నా. రోజూ ఒకేచోట ఉంటూ, ఒకే రకమైన పనులు చేస్తుంటే బోర్ కొట్టదా? మనకైతే ఆటలు ఆడితే హ్యాపీగా ఉంటుంది.. మరి వాళ్లు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు? మనం ఎలా ఉంటే వాళ్లకు నచ్చుతుంది?.. ఇలా బోలెడు ప్రశ్నలు అడుగుతాను. దీని వల్ల వాళ్ల నుంచి కొత్తవి నేర్చుకోవచ్చు. వారితో ఎక్కువ సమయం గడిపినట్లుగానూ ఉంటుంది. వాళ్లేం చెబుతారో విని, అదంతా మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్! నా ఐడియా నచ్చితే, సరదాగా మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.. మీకు నచ్చిన ప్రశ్నలు అడగండి. నేను చెప్పాకా.. మనందరి సమాధానాలు ఒకేలా ఉన్నాయా లేదా అనేది చూద్దాం.. ఉంటా మరి.. వచ్చే వారం కలుస్తాను. ‘ఏంటి ఛోటూ చేతిలో బ్యాగ్ ఉంది?’ అనుకుంటున్నారా. చెప్పాను కదా.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తానని ఈరోజే బయల్దేరుతున్నాను. అమ్మ నా కోసం వెయిట్ చేస్తోంది బై!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















