పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో ఓపెనర్లు యశస్వి జయస్‌వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో వైభవ్ 400 రన్స్‌కు చేరుకొని తిరిగి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు యశస్వి చేతులమీదుగా వైభవ్ ‘ఆరెంజ్ క్యాప్’ను అందుకున్నాడు. ఈక్రమంలో ఓ సీనియర్ ఆటగాడిగా టీనేజర్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జయస్‌వాల్‌ను బ్రాడ్‌కాస్టర్ పామీ మ్బాంగ్వా అడిగారు. తనను సీనియర్ అని పిలవడంతో యశస్వి ఒకింత ఆశ్చర్యానికి గురై తర్వాత స్పందించాడు.
‘‘నేను పెద్దవాడినని నేనైతే అనుకోవడం లేదు. నేను ఇంకా చాలా చిన్నవాడినే. కాకపోతే నాకంటే వైభవ్ సూర్యవంశీ చాలా చిన్నోడు. దీని గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. అవతలి ఎండ్‌లో నిలబడి ఈ కుర్రాడు నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్ని చూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’’ అని జయస్‌వాల్ అన్నాడు
తన బ్యాటింగ్ గురించి కూడా యశస్వి మాట్లాడాడు. ‘‘ఇది భారీ స్కోర్లు నమోదయ్యే మైదానమని మాకు ముందే తెలుసు. కాబట్టి, మేము మా దూకుడును కొనసాగించాలి. అలాగే మాకు సరైన అవకాశం దొరికినప్పుడల్లా ధైర్యంగా షాట్లు ఆడాలి. అందుకే నేను కూడా సరే చెత్త బంతులు వస్తే వదలకుండా బాదేయాలని అనుకున్నా. పైగా మేం 200కు పైగా పరుగులు సాధించాల్సిఉంది. కాబట్టి మాకు ఒక మంచి ఆరంభం లభించడం ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















