చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఒకరకంగా భారత్‌కు కలిసొచ్చే అంశమని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు. దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని సాగర్ అదానీ అన్నారు. ప్రపంచ ఆయిల్ మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటుందా? స్థిరత్వం సాధిస్తుందా? అనే దానికి కాలమే సమాధానం చెప్తుందన్నారు. అదే సమయంలో యూఏఈతో భారత్‌కు ఉన్న మంచి సంబంధాల దృష్ట్యా మనకు లాభించే అవకాశం ఉందన్నారు. భారత్ కోణంలో చూస్తే ఈ పరిణామం వల్ల మేలు జరుగుతుందని, ప్రపంచ మార్కెట్ కోణంలో చూడాల్సివస్తే ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేమన్నారు
రూపాయిల్లో చెల్లింపులకు అవకాశం
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం వల్ల భవిష్యత్‌లో ప్రపంచ చమురు మార్కెట్‌లోకి క్రూడాయిల్ సరఫరా పెరుగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌లో రీసెర్చ్ హెడ్ ఆనింద్య బెనర్జీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగుపడ్డాక సరఫరా పుంజుకొంటుందని చెప్పారు. అలాగే, భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చమురు కొనుగోళ్లకు రూపాయిల్లో చెల్లింపుల్లో వేగం పుంజుకొనే అవకాశం ఉందన్నారు. డాలర్లకు బదులుగా భారతీయ రూపాయిల్లో చమురు కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుందని బెనర్జీ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















