రష్యాకు చెందిన ఓ ఆస్కార్ విజేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఆస్కార్ అవార్డును ఆయుధంగా భావించిన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది.. దాన్ని ఆయనతోపాటు విమానం లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు విమాన కార్గోలో దాన్ని ఎక్కించగా.. తీరా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అది కనిపించకుండా పోవడం గమనార్హం. ఎట్టకేలకు దాని ఆచూకీ కనిపెట్టినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.
రష్యాకు చెందిన ఫిల్మ్‌మేకర్ పాషా తాలాన్కిన్.. ‘Mr. Nobody Against Putin’ అనే డాక్యుమెంటరీకి కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ గెలుచుకున్నారు. ఇటీవల ఆయన లుఫ్తాన్సా విమానంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లేందుకుగానూ న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, ఆయన ఆస్కార్ విగ్రహాన్ని ఆయుధంగా భావించి దాన్ని విమానంలోకి తనవెంట తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆ అవార్డును ఓ డబ్బాలో పెట్టి.. కార్గోలో ఎక్కించారు.
అయితే, ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకున్న అనంతరం ఆ డబ్బా కనిపించకపోవడంతో ఆయన హతాశుడయ్యారు. తాను ఈ పురస్కారంతో అనేకసార్లు విమానంలో ప్రయాణించానని.. ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని మీడియా ఎదుట వాపోయారు. అయితే రెండు రోజులకే ఆ అవార్డు దొరికిందని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. దాన్ని వీలైనంత త్వరగా ఆయనకు అప్పగిస్తామని తెలిపింది. ఈ ఘటనపై ఆయనకు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు అంతర్గత విచారణను చేపట్టినట్లు పేర్కొంది.
గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన తాలాన్కిన్.. ప్రస్తుతం ప్రవాస జీవనం గడుపుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అనంతరం స్థానిక పాఠశాలల్లో జాతీయవాద, సైనికపరమైన పాఠ్యప్రణాళికను అమలు చేయాలన్న క్రెమ్లిన్ ఆదేశాన్ని ఆయన ధిక్కరించడమే దీనికి కారణం. డేవిడ్ బోరెన్‌స్టైన్ దర్శకత్వంలో, తాలాన్కిన్ కో-డైరెక్టర్‌గా ఆ డాక్యుమెంటరీ రూపొందింది. సమాజంలో గుర్తింపుపొందిన ఉపాధ్యాయుడి నుంచి.. సొంత దేశంలోనే బహిష్కరణకు గురైన వ్యక్తిగా మారిన ఆయన ప్రయాణాన్ని అందులో తెరకెక్కించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















