అయోధ్య రామాలయ విరాళాల చోరీ అంశంపై విపక్షాలు పార్లమెంట్ వేదికగా వినూత్న నిరసన చేపట్టాయి. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో పార్లమెంట్ ఆవరణలో స్కిట్ ప్రదర్శించారు. ఆయనతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రుచి వీరా, అవధేశ్ ప్రసాద్ కూడా ఇందులో పాల్గొన్నారు.
స్కిట్‌లో భాగంగా ఎంపీల నుంచి హుండీలో విరాళాలు సేకరించగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు కూడా విరాళాలు ఇచ్చినట్లు ప్రదర్శించారు. అనంతరం సేకరించిన డబ్బుతో సన్యాసి పారిపోవడం, ఎంపీలు అతడిని పట్టుకోవడం వంటి సన్నివేశాలతో స్కిట్‌ను ముగించారు.
అయోధ్య రామాలయ విరాళాల అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. మరోవైపు, పార్లమెంట్ ఆవరణలో పప్పు యాదవ్ కాషాయ వస్త్రధారణపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణానికి సభ్యులు విభిన్న వేషధారణలతో రావడం సరికాదని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















