కాల్పుల విరమణ కొనసాగుతోన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో సంఘర్షణపై ఇరాన్ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
శాంతి చర్చలపై ఇరాన్- అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది. ఒప్పందం కోసం ఇరాన్ తాజాగా పంపిన ప్రతిపాదనపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈక్రమంలో ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని ఆరోపించారు. అమెరికా అధికారుల ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. ఈ క్రమంలో అమెరికా- ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది: అమెరికా హెచ్చరికలు
చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి లో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలుచేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా యూఎస్ ట్రెజరీ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్ విధించే టోల్ చెల్లిస్తే ఆయా షిప్పింగ్ సంస్థలు తమ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. టోల్ చెల్లింపులతో సహా ఇరాన్ సైన్యానికి మద్దతిచ్చే వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















