ఈదురుగాలులతో వర్షం కురవడంతో జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆస్తి, పంట నష్టం సంభవించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం రాత్రి వీచిన గాలిదుమారం కారణంగా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో ఇంటి స్లాబుపై ఉన్న రైలింగ్ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉన్న ఆటో, ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగేలా విద్యుత్ స్తంభం నేలకూలింది.
బి.కొండాపూర్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 25 కేవీ నియంత్రికతో పాటు పలు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు.
తూప్రాన్ మండలంలోని 14 గ్రామాల పరిధిలో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలిదుమారంతో మామిడికాయలు భారీగా నేలరాలిపోయాయి. అంతేకాకుండా రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి సమయంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో రవాణా అంతరాయం ఏర్పడింది.
మాసాయిపేట మండలం కొప్పులపల్లి తండాలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఇంటి యజమాని శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి ముందుగానే బయటకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై తహసీల్దార్ జ్ఞానజ్యోతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నష్ట నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు.
కౌడిపల్లి మండలంలో బుధవారం సాయంత్రం మరోసారి ఈదురుగాలులతో వర్షం కురవడంతో ధాన్యం కేంద్రాల్లో నిల్వ చేసిన పంట తడిసిపోయింది. శేరితండా, దేవులపల్లి గ్రామాల్లో రోడ్లపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















