పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన యువకుడు శరత్ (24) ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం పెద్దేముల్–తాండూరు మార్గంలోని రుక్మాపూరు–ఖాంజాపూరు రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.
తాండూరులోని ఓ దుకాణంలో పనిచేస్తున్న శరత్, విధులు ముగిశాక స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ మద్యం అలవాటుకు బానిసయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఇంట్లో పలుమార్లు మందలించడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడని సమాచారం.
మంగళవారం సాయంత్రం రైల్వే పట్టాలపైకి వెళ్లిన శరత్, తన తండ్రి, భార్య విజయలక్ష్మి, ఇతర బంధువులకు వీడియో కాల్ చేసి “నాన్నా.. నన్ను క్షమించు” అంటూ భావోద్వేగంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం తాండూరు వైపు వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న తాండూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం శవపరీక్షలు పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వీరేశం తెలిపారు. ఈ ఘటనతో రేగొండి గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయాలను కలచివేశాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















