హర్మూజ్ జలసంధి లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా చేపట్టిన నావికాదళ ఆపరేషన్‌కు అనూహ్యంగా బ్రేక్ పడింది. తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు సౌదీ అరేబియా నిరాకరించడంతోనే అమెరికా ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ గల్ఫ్ దేశాల్లో కలకలం రేపినట్లు సమాచారం. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా పలు మిత్రదేశాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా ఫోన్‌లో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ.. దీర్ఘకాలిక పరిష్కారం లేకుండా ఇలాంటి ఆపరేషన్ ప్రారంభించడం ప్రమాదకరమని సౌదీ భావించినట్లు సమాచారం. అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతిస్తున్నామని రియాద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై కూడా సానుకూలంగా స్పందించినట్లు గల్ఫ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రణాళికపై మిత్రదేశాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని వైట్‌హౌస్ ప్రతినిధి చెబుతుండగా.. ట్రంప్ ప్రకటన తర్వాతే ఈ విషయం తెలిసిందని పశ్చిమాసియా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో అమెరికా-గల్ఫ్ దేశాల మధ్య సమన్వయం లోపించిందన్న చర్చ మొదలైంది.
మరోవైపు ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు అమెరికాకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పలు అంతర్జాతీయ విశ్లేషకులు ఈ నష్టాన్ని ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాల్లో మొత్తం 217 నిర్మాణాలు, 11 కీలక పరికరాలు దెబ్బతిన్నట్లు అంచనా. వీటిలో హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన నిల్వ కేంద్రాలు, యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థలు ఉన్నాయని సమాచారం.
ఇరాన్ దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగాయని, అమెరికా రక్షణ వ్యవస్థలకు ఇది పెద్ద సవాల్‌గా మారిందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు మళ్లీ వేగం పుంజుకోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















