చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేసింది. వివో X300 సిరీస్‌లో భాగంగా Vivo X300 Ultra, Vivo X300 FE ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ముఖ్యంగా కెమెరా ప్రియులను ఆకట్టుకునేలా జీస్ పార్ట్‌నర్‌షిప్‌తో ఈ ఫోన్లను రూపొందించింది.
Vivo X300 Ultraలో 6.82 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా, 200MP పెరిస్కోపిక్ సెన్సర్, 50MP అల్ట్రావైడ్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వెనుక కెమెరాలతో 8K వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా కల్పించారు. 6600mAh భారీ బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో రూ.1,59,999 ధరకు అందుబాటులోకి రానుంది.
ఇక Vivo X300 FEలో 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 50MP సోనీ ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ప్రారంభ ధర రూ.79,999గా నిర్ణయించారు.ఈ రెండు ఫోన్లు మే 14 నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews


















