ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్‌కు జోడీగా సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘ఏక్ దిన్’ బాలీవుడ్‌లో ఆమెకు ఎంట్రీగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై తన అనుభవాన్ని పంచుకున్నారు.
“ఏక్ దిన్ చేయడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్. ఆ సమయంలో నేను వరుసగా ఎమోషనల్ సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే మనసుకు హాయిగా అనిపించే, ఒత్తిడి లేని పాత్రలు చేయాలని అనుకున్నాను. షూటింగ్ సమయంలో కూడా తేలికగా ఉండే కథ కావాలనిపించింది. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ క్లాసిక్ ‘బిఫోర్ సన్‌రైజ్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాను” అని ఆమె తెలిపారు.
అయితే ప్రీమియర్ షో చూసిన తర్వాత తన మనసులో మరో భావన కలిగిందని సాయి పల్లవి వెల్లడించారు. “ఈ పాత్రకు నేను సరైన ఎంపిక కాదేమో అనిపించింది. ఆ విషయం నేను ఆమిర్ ఖాన్‌తో కూడా చెప్పాను. ఈ పాత్రకు నన్ను కాకుండా మరొక కొత్త, చురుకైన అమ్మాయిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. వాళ్లు ఆ పాత్రకు ఇంకా బాగా న్యాయం చేసేవాళ్లు” అని ఆమె చెప్పినట్లు తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జునైద్ మాత్రం ఈ పాత్రకు సాయి పల్లవే సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు.
‘ఏక్ దిన్’ చిత్రం థాయ్ సినిమా ‘వన్ డే’కు రీమేక్‌గా తెరకెక్కగా, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















