Biologyలో ముఖ్యమైన ఫైలమ్‌లలో ఒకటైన Echinodermataకు చెందిన జీవులు ప్రత్యేకమైన సముద్ర జీవులుగా గుర్తింపు పొందాయి. ఇప్పటివరకు భూమిపై లేదా మంచినీటిలో నివసించే ఇకైనోడర్మ్‌లు గుర్తించబడలేదు. ఇవి పూర్తిగా సముద్రాల్లోనే జీవిస్తాయి.
ఈ ఫైలమ్‌కు చెందిన జీవులు బహుకణ జీవులు కాగా, బాగా అభివృద్ధి చెందిన అవయవ వ్యవస్థలను కలిగి ఉంటాయి. నిర్మాణపరంగా ఇవి అవయవ వ్యవస్థ స్థాయిని ప్రదర్శిస్తాయి. ఎక్కువగా నక్షత్రాకార రూపంలో కనిపించినప్పటికీ, కొన్ని గోళాకారంగా లేదా పొడవైన ఆకారంలో కూడా ఉంటాయి.
ఇకైనోడర్మేటా జీవుల ప్రధాన లక్షణాల్లో స్పైనీ స్కిన్ (ముళ్లలాంటి చర్మం) ఒకటి. వీటి శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉండటంతో సముద్ర జీవశాస్త్రంలో ఇవి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ ఫైలమ్‌కు చెందిన ముఖ్యమైన జీవులు:
- సముద్ర నక్షత్రాలు (ఆస్టెరాయిడియా)
- సముద్రపు అర్చిన్‌లు (ఇకినోయిడియా)
- పెళుసు నక్షత్రాలు (ఎఫియురాయిడియా)
- సముద్ర దోసకాయలు (హోలోతురాయిడియా)
- సముద్రపు లిల్లీలు (క్రినోయిడియా)
న్యూట్రియంట్ సైక్లింగ్, సముద్ర పర్యావరణ సమతుల్యత, ఆర్థిక ప్రాముఖ్యత వంటి అనేక అంశాల్లో ఇకైనోడర్మేటా జీవులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పోటీ పరీక్షల దృష్ట్యా కూడా ఈ అంశం ఎంతో కీలకంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















