వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కృష్ణా నదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి చేరే వరకు సంబంధిత మంత్రులు, అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
కొడంగల్ నుంచి దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కని ఈ ప్రాంతానికి తనకు సీఎం పదవి దక్కడం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















