థియేటర్స్‌లో ‘కరుప్పు’ క్లైమాక్స్ చూసి పూనకాలతో ఊగిపోతున్న ప్రేక్షకులకు తగిన ప్రథమ చికిత్స అందించాలని నటుడు సూర్య కోరారు. ఆయన కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. త్రిష కథానాయికగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూర్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన కొన్ని వీడియోలు, ఘటనలపై సూర్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూనే ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన సూచన చేశారు.
“ఎన్నో అడ్డంకులను అధిగమించి ‘కరుప్పు’ విజయవంతంగా ప్రదర్శితమవడం సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు ముందు థియేటర్స్ యజమానులు, సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ తొలగిపోయాయి. నా ప్రియమైన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా మరో విన్నపం కూడా చేస్తున్నా. ‘కరుప్పుస్వామి’ని చూసి థియేటర్స్‌లో పరవశించిపోతున్న ప్రేక్షకులను దయచేసి వీడియోలు తీయకండి. వారికి ముందుగా తగిన ప్రథమ చికిత్స అందించాలని కోరుతున్నా” అని ఆయన పేర్కొన్నారు.
ఫస్ట్ వీకెండ్‌లో భారీ వసూళ్లు – రూ.147 కోట్లు గ్రాస్
మరోవైపు, తమిళంతో పాటు తెలుగులోనూ ‘వీరభద్రుడు’గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.147 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలిపింది.
సూర్య గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో విజిల్స్, కేకలతో అభిమానుల హంగామా కనిపిస్తోంది.
ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ చిత్రాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు అనుకూలంగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















