కుటుంబ కలహాల నేపథ్యంలో కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చెరువులో మృతదేహాలుగా కనిపించడం కలకలం రేపింది. విజయపుర సమీపంలోని భూతనాల చెరువులో బుధవారం ఉదయం మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఆదర్శనగర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువులో తేలియాడుతున్న మృతదేహాలను బయటకు తీసి వివరాలు సేకరించారు. మృతులను శోభా జాలగెరి (45), ఆమె కుమార్తెలు విద్య (16), సువర్ణ (14), శానిక (7), కుమారులు గౌడేష్ (10), వికాస్ (5)గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శోభా కుటుంబ సభ్యులు కనిపించడం లేదని ఆమె భర్త భీమరాయ ఈ నెల 24న ఆదర్శనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు.
భీమరాయ మద్యానికి బానిస కావడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శోభా తన పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. తాము ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఆమె హెచ్చరించినట్లు భీమరాయ పోలీసులకు తెలిపాడు.
సోమవారం ఇంటి నుంచి వెళ్లిన శోభా, ఆమె ఐదుగురు పిల్లలు.. బుధవారం ఉదయం భూతనాల చెరువులో విగతజీవులుగా కనిపించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















