Motorola భారత మార్కెట్‌లో తన జీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. Moto G37 మరియు Moto G37 Power పేర్లతో ఈ ఫోన్లను లాంచ్ చేసింది.
ఈ రెండు ఫోన్లు కూడా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో తీసుకురాగా, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో మంచి పనితీరును అందించనున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లలో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.Moto G37 లో 5,200mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫోన్ ధర రూ.13,999గా నిర్ణయించారు.
ఇక Moto G37 Power లో భారీ 7,000mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 4GB +128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8GB +128GB ధర రూ.18,999గా కంపెనీ ప్రకటించింది.ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మే 25 నుంచి Flipkart, మోటోరొలా ఇండియా వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్లలో విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















