University of Hyderabad లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నెల రోజుల క్రితం యూనివర్సిటీ రీడింగ్ రూమ్ నుంచి ఒక విద్యార్థికి చెందిన ల్యాప్‌టాప్ మాయమైంది. ఈ విషయమై తోటి విద్యార్థులు మయాంక్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నానని చెప్పి తిరిగి ఇచ్చినట్లు సమాచారం.అనంతరం మరో రెండు ల్యాప్‌టాప్‌లు కనిపించకపోవడంతో వాటి విషయమై కూడా మయాంక్‌ను విద్యార్థులు నిలదీశారు. తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే ఆ రెండు ల్యాప్‌టాప్‌లతో తనకు సంబంధం లేదని మయాంక్ స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ ఘటన తర్వాత సోమవారం నుంచి మయాంక్ కనిపించకుండా పోయాడు. మంగళవారం హాస్టల్ సిబ్బంది గదిని పరిశీలించగా ఆయన రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తాను ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ల్యాప్‌టాప్‌ల చోరీలో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు.చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసిన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది చెరువు వద్ద గాలించగా మయాంక్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















