Google DeepMind సీఈవో Demis Hassabis కృత్రిమ మేధ (AI) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచేందుకు ఉపయోగించాలే కానీ.. ఉద్యోగులను తొలగించేందుకు సాకుగా మార్చకూడదని స్పష్టం చేశారు.
Google I/O కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. క్లిష్టమైన కోడింగ్ పనులను నిర్వహించే జెమిని 3.5 ఫ్లాష్ మోడల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త ఏఐ మోడళ్ల అభివృద్ధి అంటే కోడింగ్ ఉద్యోగుల అవసరం తగ్గిందని కాదు అని పేర్కొన్నారు.పలు టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు ఏఐ పేరును వాడుకుంటున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని ‘ఏఐ వాషింగ్’గా అభివర్ణించారు.
కేవలం ఉద్యోగుల సంఖ్య తగ్గించడం ద్వారా ఖర్చులు ఆదా చేయడం కంటే.. ఉత్పాదకత పెంపే తమ లక్ష్యమని తెలిపారు. కోడింగ్‌లో ఏఐ మరింత అభివృద్ధి చెందితే.. ఇంజినీర్లతో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంటుందని వివరించారు.ముందుచూపు లేకపోవడం వల్లే కొన్ని కంపెనీలు డెవలపర్‌ల స్థానంలో ఏఐని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని డెమిస్ హస్సాబిస్ అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















