Vijayawada నగరంలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరి మధ్య ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదం ఈ ఘర్షణకు కారణమైనట్లు సమాచారం.
కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్, భారతీనగర్‌కు చెందిన బొల్లా ఓమ్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి ఫోన్‌లో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో, పటమట ఆర్‌ఆర్ గార్డెన్ సమీపంలోని హైటెన్షన్ రోడ్డుకు ఓమ్ థార్ జీప్‌లో వెళ్లాడు. అక్కడ ఇద్దరూ తమ వాహనాలను ఒకదానితో ఒకటి పలుసార్లు ఢీకొట్టుకుంటూ రోడ్డుపై హడావుడి సృష్టించారు.
దాదాపు 100 మీటర్ల వరకు జీప్‌లను ఒకదానితో ఒకటి ఈడ్చుకుంటూ వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వాహనాల నుంచి దిగిన ఇద్దరూ రాడ్లతో ఒకరి జీప్ అద్దాలను మరొకరు ధ్వంసం చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపు రోహిత్ పరారయ్యాడు. ఓమ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















