India స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజాగా Nibe Limited అభివృద్ధి చేసిన ‘వాయుఅస్త్ర-1’ (Vayu Astra-1) లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగం విజయవంతమైంది.రాజస్థాన్‌లోని Pokhranలో గత నెల 18, 19 తేదీల్లో తొలి పరీక్షలు నిర్వహించగా.. అనంతరం ఉత్తరాఖండ్‌లోని Joshimath వద్ద మరో విడత ప్రయోగాలు చేపట్టారు.
లాయిటరింగ్ మ్యూనిషన్‌లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు. ఇవి గాల్లో తిరుగుతూ లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దాడి చేస్తాయి. వాయుఅస్త్ర-1 దాదాపు 10 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని కంపెనీ తెలిపింది. తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది.
ఈ డ్రోన్‌కు లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే దాడిని విరమించుకోవడం, అవసరమైతే మళ్లీ ఎటాక్ చేయడం వంటి ఆధునిక సామర్థ్యాలు ఉన్నాయి. రాత్రిపూట ఇన్‌ఫ్రారెడ్ కెమెరా సహాయంతో లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు సంస్థ తెలిపింది.ఉత్తరాఖండ్ పరీక్షల్లో వాయుఅస్త్ర-1 90 నిమిషాలకు పైగా గాల్లో తిరుగుతూ.. 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యూనిషన్ నమూనా ఆధారంగా అభివృద్ధి చేసినట్లు నిబే లిమిటెడ్ పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















