Align Technology తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. రూ.1,800 కోట్లతో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని Hyderabadలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు అలైన్ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా నాలుగో తయారీ కేంద్రంగా నిలవనుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి Duddilla Sridhar Babu సమక్షంలో సంస్థ ప్రతినిధులు, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది.
అత్యాధునిక 3డీ ప్రింటింగ్, డిజిటల్ తయారీ వ్యవస్థలు, ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతలతో ఈ యూనిట్ పనిచేయనుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 లక్షల క్లియర్ అలైనర్ భాగాల తయారీ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మెడ్‌టెక్, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఇన్నోవేషన్ సెంటర్ నిర్వహిస్తున్న అలైన్ టెక్నాలజీ.. ఈ కొత్త యూనిట్‌తో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.2027లో ఈ తయారీ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండగా, తొలి దశలో 300 మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















