డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మీ రామమూర్తి (70) నుంచి సుమారు రూ.24 కోట్లు కాజేశారు.
బాధితురాలు Lakshmi Ramamurthy శివాజీనగరలో నివసిస్తున్నారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆస్తులు విక్రయించి వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో ఉంచిన విషయాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.తాము అధికారులు అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు, నగదు అక్రమ లావాదేవీల్లో మీ పేరు ఉందని బెదిరించారు. “డిజిటల్ అరెస్ట్” చేస్తున్నామని చెప్పి ఆమెను మానసికంగా భయపెట్టారు. ఆ భయంతో ఆమె దశల వారీగా తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.24 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలింది.
అంతేకాకుండా మరింత డబ్బు కావాలంటూ ఒత్తిడి చేయడంతో, ఇంట్లో ఉన్న 1.30 కిలోల బంగారు ఆభరణాలను కూడా తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వెళ్లారు. ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన బ్యాంకు మేనేజర్ వివరాలు అడగడంతో ఈ మోసం బయటపడింది.సీసీబీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబయి, దిల్లీకి చెందిన గౌరవ్ కుమార్, ఓం ప్రకాశ్ రాజ్‌పుత్ సహా కొందరిని అరెస్ట్ చేశారు. వారి ఖాతాల్లో ఉన్న రూ.60 లక్షలు జప్తు చేశారు. మిగిలిన మొత్తం మరో 22 ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















