‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు సానాపై బాలీవుడ్ నటుడు Divyenndu Sharma ప్రశంసలు కురిపించారు. ఆయన కారణంగానే ‘పెద్ది’లో నటించేందుకు ఒప్పుకున్నానని వెల్లడించారు. Ram Charan హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు.
“నేను ఉత్తరాఖండ్‌లో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ చిత్ర బృందం నుంచి కాల్ వచ్చింది. తర్వాత మళ్లీ ‘మిమ్మల్ని కలవాలి’ అంటూ బుచ్చిబాబు గారు నిరంతరం మెసేజ్‌లు పంపారు. దీంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసి ప్రయాణించి వచ్చాను. ఆయనను కలిసిన వెంటనే చాలా ప్రభావితమయ్యాను. కళకు ఆయన ఇచ్చే గౌరవం అద్భుతం. నా పాత్రను వివరించిన వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. కథ ఎలా ఉన్నా బుచ్చిబాబు కోసం చేయాలి అనిపించింది” అని తెలిపారు.
‘పెద్ది’ కథ గురించి మాట్లాడుతూ, “స్టోరీ చదివిన తర్వాత షాక్ అయ్యాను. ఎంతో బాగా రాశారు. ఎన్నో ట్విస్ట్‌లు, బలమైన పాత్రలు ఉన్నాయి. గుర్తింపు కోసం ఒక మనిషి చేసే పోరాటం ఈ కథలో ప్రధానాంశం. ‘పెద్ది’ తన గుర్తింపు కోసం చేసే ప్రయాణం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది” అని దివ్యేందు చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















