పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా ఒక్కసారిగా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు దిగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చుతున్న పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేపట్టింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ నుంచి తమ విమానవాహక నౌకలు, యుద్ధ నౌకలకు ముప్పు ఏర్పడటంతో స్వీయరక్షణ చర్యల్లో భాగంగా ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. బందర్ అబ్బాస్ పోర్టులోని కీలక నౌకాదళ స్థావరం ధ్వంసమైనట్లు అమెరికా వెల్లడించింది.
దాడుల్లో ఇజ్రాయెల్ కూడా భాగస్వామ్యమైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేపట్టింది. ఈ ఘటనల్లో కనీసం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు ఉద్దేశపూర్వక వంచన అని మండిపడింది. దాడుల పర్యవసానాలకు అమెరికాదే పూర్తి బాధ్యత అని హెచ్చరించింది. అవసరమైతే తగిన ప్రతీకారం తప్పదని స్పష్టం చేసింది.
ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు సురక్షిత ప్రాంతం కాదని హెచ్చరించారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం అంశంపై ఇరాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















