ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా తరహా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది.
ఈ నెల 23న ఉగాండా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు తేలికపాటి అనుమానాస్పద లక్షణాలను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందాలు ఆమెను ప్రత్యేక ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచాయి.ఆమె నుంచి సేకరించిన రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పరీక్షల కోసం పంపించారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కర్ణాటక ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎబోలా అని నిర్ధారించలేమని, పరీక్షల ఫలితాల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.ఇక ఇదే సమయంలో బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కొత్త ఎబోలా స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















