హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలపై హైడ్రా భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేటలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జాల నుంచి విడిపించింది.మంగళవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి కంచెలు ఏర్పాటు చేశారు. ఒక్కరోజే దాదాపు రూ.4,117 కోట్ల విలువైన భూములను రక్షించినట్లు అధికారులు తెలిపారు.
కోకాపేట కొత్తచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో గోల్డ్‌ఫిష్ కాలనీ పేరుతో పనిచేస్తున్న సంస్థ 1.09 ఎకరాలను ఆక్రమించినట్లు హైడ్రా గుర్తించింది. చెరువును మట్టితో పూడ్చి అక్కడ గార్డెన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేసినట్లు తేలింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన చేపట్టిన హైడ్రా.. ఆ నిర్మాణాలను తొలగించి కంచె వేసింది.
ఇక కోకాపేట పెద్దచెరువు పరిధిలో దాదాపు 22 ఎకరాల వరకు చెరువు స్థలాన్ని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఈ భూముల విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.అలాగే ఐటీ కారిడార్ పరిధిలోని ఖానామెట్ గ్రామంలో ఈదులకుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలకు ప్రయత్నించిన రియల్టర్ల యత్నాన్ని కూడా హైడ్రా అడ్డుకుంది. వరద కాలువను మళ్లించి చెరువును ఎండబెట్టినట్లు గుర్తించి, శాటిలైట్ చిత్రాల ఆధారంగా చెరువు సరిహద్దులను నిర్ధారించింది. దాదాపు 6.50 ఎకరాల చెరువు భూమిని రక్షించింది.
ఈదులకుంట చెరువు పక్కన ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారుల నుంచి కాపాడింది. సర్వే నంబర్లు మార్చి అక్రమ నిర్మాణాలకు యత్నించినట్లు గుర్తించి కంచె వేసింది.అదేవిధంగా భరత్‌నగర్-హఫీజ్‌పేట రహదారి విస్తరణ కోసం సేకరించిన భూమిని తిరిగి ఆక్రమించిన ఘటనను బయటపెట్టింది. పరిహారం తీసుకున్న యజమానే 1700 గజాల స్థలాన్ని కబ్జా చేసి కార్యాలయం, గోశాల ఏర్పాటు చేసినట్లు గుర్తించి వాటిని తొలగించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















