శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని భారాస పక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ భూ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
173 నుంచి 183 సర్వే నంబర్ల మధ్య ఉన్న ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని ఆర్డీవో హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారని, అదే భూమిని తహసీల్దార్ ప్రైవేటు వ్యక్తుల పేరిట నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకే భూమిపై రెండు విభిన్న అఫిడవిట్‌లు ఎలా సమర్పించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.భూమిని ప్రొహిబిటరీ లిస్ట్ 22ఎలో ఉంచాలని ఆర్డీవో ఆదేశించారని, అనంతరం తహసీల్దార్ కూడా ప్రభుత్వ భూమిగానే నిర్ధారించారని తెలిపారు. కానీ నాలుగు రోజులకే అదే భూమిని ప్రైవేటు వ్యక్తులకు చెందిందని ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.
ఈ భూ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తహసీల్దార్‌ను కేవలం బదిలీ చేయడం సరిపోదని, వెంటనే సర్వీసు నుంచి తొలగించాలని కోరారు.
ఇక జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై సస్పెన్షన్ విధించడాన్ని కూడా హరీశ్‌రావు ఖండించారు. రైతుల సమస్యలపై స్పందించడం తప్పా అని ప్రశ్నించారు.అదేవిధంగా సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. అధికారిక లెక్కల్లో చూపిస్తున్న బొగ్గు నిజంగా ఉందా లేదా అన్నది అఖిలపక్షంతో కలిసి పరిశీలించేందుకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















