పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పెద్దపులి మరోసారి దాడులకు తెగబడింది. గ్రామాల్లో వరుస ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
మండలంలోని చికిలింత, పెద్దగర్రంగి, పెద్ద రేలంగిపాడు గ్రామాల్లో మొత్తం 9 లేగ దూడలను పులి హతమార్చినట్లు అటవీశాఖ రేంజర్ ఉషారాణి తెలిపారు. చికిలింత గ్రామంలో 7 దూడలపై, అలాగే పెద్దగర్రంగి, పెద్ద రేలంగిపాడు గ్రామాల్లో ఒక్కో దూడపై బుధవారం తెల్లవారుజామున పులి దాడి చేసినట్లు వెల్లడించారు.
ఈ ఘటనల నేపథ్యంలో వాతంగి, చికిలింత పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, పశువులను అడవిలోకి వదలకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















