భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పెద్ది’ (Peddi) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఒక రోజు ముందే అంటే జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ ప్రారంభం కావడంతో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్‌ను దాటడం విశేషంగా మారింది. దీంతో ఈ చిత్రం ప్రీమియర్స్‌లోనే వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన రామ్‌చరణ్ సినిమాగా నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఈ స్థాయి ప్రీమియర్ వసూళ్లు సాధించిన సినిమా ఇదేనని సమాచారం.
మరోవైపు చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ రామ్‌చరణ్ ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ‘పెద్ది’ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుందని ఆయన తెలిపారు.
కుస్తీ సన్నివేశాల్లో చరణ్ నిజంగా తీవ్రంగా శ్రమించారని, షూటింగ్ సమయంలో గాయాలైనా పట్టించుకోకుండా నటించారని బుచ్చిబాబు ప్రశంసించారు. ఒక దశలో చరణ్ కంటికి గాయం అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పందన ఎలా ఉంటుందో అని తాను భయపడ్డానని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















