తెలంగాణ రైతుల కోసం మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్మించనున్న భారీ ఫ్రూట్ మార్కెట్‌కు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్ర రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, నిల్వ వసతులు, ఎగుమతి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మార్కెట్ నిర్మాణం కోసం 239 ఎకరాల భూమిని అందించిన రైతులకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో పండ్ల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుందని, రైతుల ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం ప్రస్తుతం పలు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి తుమ్మల అన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎరువుల కొరత ఏర్పడిందని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు విదేశాల నుంచి దిగుమతులు పెరగడం వల్ల స్థానిక రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు తగ్గే ప్రమాదం ఉందన్నారు.
అలాగే డీజిల్ సరఫరాలో సమస్యల కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.1 లక్ష కోట్లకు పైగా జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews