షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్, పనితీరు మరియు బిల్డ్ క్వాలిటీ మధ్య మంచి బ్యాలెన్స్‌ను అందించేందుకు రూపొందించబడింది. భారీ బ్యాటరీతో రావడం ఈ డివైస్ ముఖ్య ఆకర్షణగా నిలుస్తోంది.
రెడ్‌మీ టర్బో 5 ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై పనిచేస్తుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేటు, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో విజువల్ అనుభవం మెరుగ్గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే IP66, IP68, IP69, IP69K రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కలదు.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు. LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ అందించారు. పనితీరు విషయంలో ఇది ఆంటుటు బెంచ్‌మార్క్‌లో 23 లక్షల పాయింట్లు స్కోర్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
కెమెరా విభాగంలో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సోనీ IMX882 సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా OIS, EIS సపోర్ట్‌తో అందించారు. 8MP అల్ట్రా వైడ్ లెన్స్, ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది. కొత్తగా “రెడ్‌మీ పిక్సెల్ మ్యాట్రిక్స్” ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కెమెరా లెన్స్ చుట్టూ సర్క్యులర్ లైట్ వెలుగుతుంది.
బ్యాటరీ విషయానికి వస్తే, 7,540mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్, బ్లూటూత్ 6.0, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర పరంగా, రెడ్‌మీ టర్బో 5 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.40,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జూన్ 19 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ కారణంగా ఇది ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















