లఖ్‌నవూ నుంచి సోమవారం ఉదయం 7.12 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 7.58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికుల సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే 8.10 గంటలకు నోయిడా నుంచి తొలి విమానం లఖ్‌నవూకు బయలుదేరింది.
విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా జేవార్ ప్రాంతానికి చెందిన 172 మంది రైతులు పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు కలిసి తొలి విమానంలో ప్రయాణించడం విశేషంగా నిలిచింది. ఈ సంఘటనతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రాత్మకంగా కార్యకలాపాలను ప్రారంభించినట్లైంది.
ఈ ప్రారంభంతో దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు కలిగిన మహానగరాల జాబితాలో చేరింది. పదేళ్ల క్రితం అసాధ్యం అనిపించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
2021 నవంబర్ 25న ఈ విమానాశ్రయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా, 2026 మార్చి 28న అధికారికంగా ప్రారంభించారు. తాజాగా వాణిజ్య విమాన సేవలు కూడా ప్రారంభమవడంతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాల్లోకి ప్రవేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















