హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గతంలో నమోదైన తొలి కేసులో అప్పటి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు సహా పలువురు నిందితులను గత ఏడాది అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే వ్యవహారంపై మరో ఫిర్యాదు ఆధారంగా సీఐడీ దర్యాప్తును ప్రారంభించింది.
సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కొత్త కేసు నమోదు చేసినట్లు సమాచారం. హెచ్‌సీఏలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉండటంతో సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సంజీవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో తాజా విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో బీసీసీఐ నుంచి నిధులు విడుదలైనప్పటికీ రంజీ మాజీ ఆటగాళ్లకు పెన్షన్లు చెల్లించకపోవడం, జింఖానా మైదానానికి సంబంధించిన అధికారిక రికార్డులు కనిపించకపోవడం, అండర్-19, అండర్-23 మరియు సీనియర్ రంజీ జట్ల కోచ్ నియామకాల్లో జాప్యం వంటి అంశాలపై సీఐడీ దృష్టి సారించనుంది.
అలాగే హెచ్‌సీఏ కార్యకలాపాలపై న్యాయస్థానాల ఆదేశాలతో ఏర్పాటైన నాలుగు కమిటీలు ఇప్పటికే ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలిస్తూ సమగ్ర దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















