ఇన్‌యాక్టివ్ వాలెట్‌లపై ఛార్జీల విషయంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఫోన్‌పే స్పష్టత ఇచ్చింది. ఈ ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు, క్యాష్‌బ్యాక్ రివార్డులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఏడాది పాటు ఎలాంటి డిజిటల్ లావాదేవీలు చేయని వాలెట్‌లను ఇన్‌యాక్టివ్‌గా పరిగణించి నిర్వహణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే ముందే యూజర్లకు సమాచారం పంపించింది. ఈ ఛార్జీలను ప్రతి మూడు నెలలకు రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది.
అయితే, వాలెట్‌లో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే నెగటివ్ బ్యాలెన్స్ విధించబడుతుందా లేదా బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ చేస్తుందా అనే సందేహాలు వినియోగదారుల్లో ఏర్పడ్డాయి. దీనిపై ఫోన్‌పే స్పష్టత ఇస్తూ, వాలెట్ బ్యాలెన్స్ సరిపోకపోతే ఎలాంటి అదనపు లేదా నెగటివ్ ఛార్జీలు ఉండవని పేర్కొంది.
అలాగే ఇన్‌యాక్టివ్ వాలెట్ స్థితి తొలగించడానికి పూర్తి KYC అవసరం లేదని, కేవలం OTP వెరిఫికేషన్ లేదా ఒక సాధారణ వాలెట్ ట్రాన్సాక్షన్ చేస్తే వాలెట్ మళ్లీ యాక్టివ్ అవుతుందని తెలిపింది. వసూలు చేసే ఈ నిర్వహణ ఛార్జీలను వాలెట్ సేవలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని ఫోన్‌పే వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















