ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా భావించే ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలోని బర్జాన్ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతైనట్లు సమాచారం.
పేలుడు జరిగిన ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ మంటల కారణంగా ప్లాంట్ పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఇంతకుముందు ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల సమయంలో ఐఆర్‌జీసీ దళాలు ఈ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఆ దాడుల కారణంగా గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం అప్పట్లో గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. ఇటీవల ఉద్రిక్తతలు తగ్గడంతో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేందుకు ఖతార్ చర్యలు తీసుకుంటోంది.
ఖతార్ రాజధాని దోహాకు ఉత్తర–తూర్పున సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రస్ లఫాన్ నగరం ఉంది. ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఈ ప్రాంతం నుంచి గ్యాస్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా, భారత్, యూరోపియన్ యూనియన్, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
భారతదేశ ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో ఖతార్ వాటా సుమారు 40–47 శాతం వరకు ఉంది. ఇది హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరుతుంది. ఖతార్ ఎనర్జీ ఈ గ్యాస్ క్షేత్రాన్ని నిర్వహిస్తోంది.
2024లో భారత్–ఖతార్ మధ్య సుమారు 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాస్ విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, పరిశ్రమలు, గృహ అవసరాలకు భారత్‌లో అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. అమెరికా, ఆఫ్రికాతో పోలిస్తే ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతి తక్కువ ఖర్చుతో జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















