అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం పొందడం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించింది. సక్రమ మార్గంలో వచ్చిన వలసదారులు కూడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించాల్సి రావడంతో పాటు ఇప్పటివరకు ఉన్న పలు మినహాయింపులు కూడా కోల్పోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం పేపర్ బేస్డ్ పౌరసత్వ దరఖాస్తు ఫీజు 760 డాలర్లుగా ఉండగా, దాన్ని 1330 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. అదే విధంగా ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 710 డాలర్ల నుంచి 1280 డాలర్లకు పెంచే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే దరఖాస్తుదారులపై సుమారు 75 శాతం అదనపు భారం పడుతుంది.
అలాగే, పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణకు గురైతే దాన్ని మళ్లీ సమీక్షించేందుకు చెల్లించాల్సిన రుసుమును కూడా 830 డాలర్ల నుంచి 1475 డాలర్లకు పెంచాలని సూచించారు.
ఈ ప్రతిపాదనలపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.
ఇకపై తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు ప్రస్తుతం అందుతున్న ఫీజు రాయితీలను కూడా తొలగించాలని DHS ప్రతిపాదించింది. 400 శాతం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఉన్న తగ్గింపు ఫీజు ఆప్షన్‌ను తీసేయాలని సూచించడం గమనార్హం.
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ఇప్పటికే అర్హత ఉన్న శాశ్వత నివాసితులకు కూడా పౌరసత్వం పొందడం మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















