సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) నిబంధనల్లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను వెంటనే ఉపసంహరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు.
మహారాష్ట్ర సమాచార హక్కు నియమావళి 2026 ఆర్‌టీఐ చట్టం ప్రభావాన్ని తగ్గించేలా ఉందని, ప్రజలు సమాచారాన్ని పొందడాన్ని దూరం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాసిన ఆయన, జూన్ 12న తీసుకొచ్చిన సవరణలు ఆర్‌టీఐ చట్టం 2005 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
పారదర్శకతకు భంగం కలిగించేలా ఈ మార్పులు ఉన్నాయని, ప్రభుత్వ పనితీరుపై ప్రజల పర్యవేక్షణ తగ్గించే ప్రమాదం ఉందని హజారే అభిప్రాయపడ్డారు. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా సమాచార ఫీజులను పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్‌టీఐ చట్టం ఆదాయాన్ని సమీకరించే సాధనం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఫీజులు పెంచితే, సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించే అధికారులపై విధించే పెనాల్టీలను కూడా పెంచాలని ఆయన సూచించారు. ఈ సవరణలోని మరికొన్ని నిబంధనలను కూడా అన్నా హజారే తీవ్రంగా వ్యతిరేకించినట్లు లేఖలో పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















