అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా సెట్స్‌లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, ఆయన తన విజన్‌ను తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఇప్పటికే అనేకమంది నటులు పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆయన పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’లో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తన అనుభవాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఒక సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా రావడానికి రాజమౌళి గారు 90కి పైగా టేక్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని పృథ్వీరాజ్ తెలిపారు. అనుకున్న ఫలితం వచ్చే వరకు ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగ్ కొనసాగించడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరని చెప్పారు. అవసరమైతే సంతృప్తి లేకపోతే మరుసటి రోజు కూడా అదే సన్నివేశాన్ని తిరిగి చిత్రీకరిస్తారని వెల్లడించారు.
రాజమౌళితో పని చేయడం తనకు ఒక గొప్ప అనుభవమని, నటుడిగా, వ్యక్తిగా ఎంతో నేర్చుకున్నానని పృథ్వీరాజ్ అన్నారు. “నేను ఇప్పటివరకు రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని చూడలేదు. ఉదయం 7 గంటలకు షూట్ అనుకుంటే, ఆయన 5 గంటలకే సెట్స్‌కి వచ్చేస్తారు. మేము వచ్చేలోపే రిహార్సల్స్ పూర్తి చేసి కెమెరా సెటప్ సిద్ధం చేస్తారు” అని తెలిపారు.
అలాగే, ఆయనలో దర్శకుడితో పాటు గొప్ప నటుడిని కూడా తాను చూస్తానని పృథ్వీరాజ్ చెప్పారు. నటులకు భావోద్వేగాలు అర్థమయ్యేలా ఆయన పాత్రలో జీవించి చూపిస్తారని, అందుకే ఆయనతో పని చేయడం ప్రత్యేక అనుభవమని పేర్కొన్నారు.
మోహన్‌లాల్ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో ఇంత గొప్ప నటుడిని చూసింది రాజమౌళిలోనే అని ఆయన అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















