ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ చిత్రం ‘బాహుబలి’ భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది.
తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ‘బాహుబలి 3’పై అధికారిక ప్రకటన చేసి సినీప్రియులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క మాట్లాడుతూ “ప్రపంచం ఊహించని ప్రకటన ఇది… మీ అందరి కోసం బాహుబలి మూడో భాగం రానుంది” అని తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ప్రభాస్ అనుష్క గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌లో ఆమె నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆగదని, షూటింగ్ మొత్తం నిలిచిపోయేదని ఆయన ఫన్నీగా చెప్పారు. అలాగే ప్రతిరోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు “ఈరోజు నవ్వకూడదు” అని నిర్ణయించుకుని వచ్చేదని కూడా తెలిపారు. ఈ సినిమా తనకు ఒక భావోద్వేగ ప్రయాణమని ప్రభాస్ పేర్కొన్నారు.
సత్యరాజ్ మాట్లాడుతూ సెట్స్‌లో కాస్ట్యూమ్స్ భారీగా ఉండేవని, కనుచూపు మేరలో డ్రెస్‌లే కనిపించేవని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక గతంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి ‘బాహుబలి 3’ చేసే అవకాశం ఉందని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటీనటుల తాజా వ్యాఖ్యలతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బాహుబలి మూడో భాగంపై దృష్టి పెట్టవచ్చని సినీ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. రెండుభాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి మూడో భాగంతో ఆ రికార్డులను మరింతగా తిరగరాస్తారని ఆశిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















