కథానాయిక తమన్నా ప్రత్యేక గీతాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలను తాను “ఐటమ్ సాంగ్స్”గా చూడనని, అవి తన దృష్టిలో “ప్రత్యేక డ్యాన్స్ నంబర్స్” మాత్రమేనని చెప్పింది.
తమన్నా మాట్లాడుతూ, తాను చేసే వైవిధ్యమైన పాత్రలతో పాటు ప్రత్యేక గీతాల్లోనూ ప్రేక్షకులను అలరిస్తూ, హుషారైన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, ఈ రకమైన పాటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కరీనా కపూర్, కత్రినా కైఫ్ చేసిన ‘చమ్మక్ చల్లో’, ‘షీలా కీ జవానీ’, ‘కమ్లీ’ వంటి పాటలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆమె పేర్కొంది. ఈ పాటల్లో నటీమణులు హుందాతనంతో పాటు తమను తాము ఆస్వాదిస్తూ ప్రదర్శన ఇస్తారని చెప్పింది.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీ డ్యాన్స్ పాటలను ఆస్వాదిస్తారని తమన్నా అభిప్రాయపడింది. తన దృష్టిలో ఇవి కేవలం పార్టీ సాంగ్స్ మాత్రమేనని, “ఐటమ్ సాంగ్స్” అనే పదాన్ని ఉపయోగించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఈ పాటలు చివరి వరకు ప్రేక్షకులను అలరించే పార్టీ నంబర్లుగానే ఉంటాయని ఆమె పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















