తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినిమా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కె. భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన తన సినీ ప్రయాణాన్ని దర్శకులు జి. రామకృష్ణన్, భారతీరాజా వద్ద అసిస్టెంట్‌గా ప్రారంభించారు. అనంతరం భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు.
1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘16 వెయతినిలె’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో నటుడిగా కూడా గుర్తింపు పొందారు.
భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే కాకుండా కథా రచయితగా, సంగీత దర్శకుడిగా కూడా తన బహుముఖ ప్రతిభను చాటారు. ఆయన దర్శకత్వం వహించిన, నటించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1983లో వచ్చిన ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆయన రచనలు హిందీ, తెలుగు సహా పలు భాషల్లో రీమేక్ అయి విజయాలు సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ వంటి చిత్రాలకు కథ అందించారు.
ఇటీవల తెలుగు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించిన ఆయన, ‘35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో కనిపించారు. స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన కె. భాగ్యరాజ్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















