మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘జైలర్’. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్గా ‘జైలర్ 2’ రూపొందుతోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపింది. వాస్తవానికి ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లోనే పూర్తయింది. అయితే దర్శకుడు నెల్సన్ కథకు మరిన్ని కీలక సన్నివేశాలను జోడించి 25 రోజుల పాటు మళ్లీ చిత్రీకరణ జరిపారు. ఆ అదనపు షూట్ కూడా తాజాగా పూర్తయినట్లు టీమ్ వెల్లడించింది.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల చెన్నైకి రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు చెప్పబడుతోంది. తాజా షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలే చిత్రీకరించినట్లు సమాచారం.
పలు భాషల అగ్రతారలు అతిథి పాత్రల్లో మెరవడం ‘జైలర్’ ప్రత్యేకతగా నిలిచింది. అదే తరహాలో ‘జైలర్ 2’లో కూడా భారీ స్టార్ కాస్ట్ ఉండనుందని తెలుస్తోంది. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ముగిసిన చోట నుంచే సీక్వెల్ కథ ప్రారంభమవుతుందని గతంలో శివరాజ్ కుమార్ వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















