ప్రముఖ మరాఠీ రంగస్థల దర్శకురాలు, నటి విజయ మెహతా (91) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించారు.
1934లో గుజరాత్లో జన్మించిన విజయ మెహతా, ముంబయి కాలేజీలో చదువుతున్న సమయంలో ‘ఒథెల్లో’ నాటకంలో నటించారు. ఆమె నటన దిగ్గజ నాటక దర్శకుడు ఇబ్రహీం అల్కాజీ దృష్టిని ఆకర్షించగా, అనంతరం ఆయనతో పాటు ఆది మర్జ్బాన్ వద్ద కూడా శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రఖ్యాత నాటక రచయిత విజయ్ తెందూల్కర్, నటులు అరవింద్ దేశ్పాండే, శ్రీరామ్ లాగూలతో కలిసి ముంబయిలో ‘రంగయన్’ నాటక సమాజాన్ని స్థాపించారు.
మరాఠీ నాటకరంగం, భారతీయ ప్రదర్శన కళల్లో దశాబ్దాల పాటు సేవలందించిన విజయ మెహతా, అనేక మంది కళాకారులను తీర్చిదిద్దారు. ఆమె ‘కలియుగ్’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1984లో వచ్చిన ‘పార్టీ’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘పెస్టోంజీ’, ‘మెహతా రావు సాహెబ్’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. చివరిగా 1991లో వచ్చిన ‘లైఫ్లైన్’ టెలివిజన్ సిరీస్కు దర్శకత్వం వహించారు.
ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు, ఠాగూర్ రత్న సహా అనేక పురస్కారాలు లభించాయి. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విజయ మెహతా మరణం భారతీయ కళారంగానికి తీరని లోటుగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















