కథానాయిక కయాదు లోహర్ తన స్కూల్ రోజులలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న సమయంలో తన ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు వెళ్తున్నప్పుడు కొందరు అబ్బాయిలు తనను వేధించేవారని ఆమె తెలిపింది. మొదట రెండు రోజులు సహించానని, కానీ మూడో రోజు తీవ్ర కోపంతో ఓ రాయిని తీసుకుని వారిలో ఒకరిపై విసిరినట్లు వెల్లడించింది. ఆ ఘటనలో ఆ వ్యక్తి తలకు గాయం అయి రక్తం కారిందని చెప్పింది.
ఈ సంఘటనను ఇప్పుడు తలుచుకుంటే అది చాలా హింసాత్మకంగా అనిపిస్తుందని కయాదు పేర్కొంది. కోపంలో ఎవ్వరినీ గాయపరచడం సరైన మార్గం కాదని అప్పటి నుంచి తాను తెలుసుకున్నానని తెలిపింది. అదే సమయంలో, తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదని, మనల్ని మనమే కాపాడుకోవాలని ఆమె అభిప్రాయపడింది.
తన జీవితంలో జరిగిన ఈ అనుభవం తన ఆలోచనలను మార్చిందని కయాదు చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఐ’యామ్ గేమ్’, ‘ది ప్యారడైజ్’, ‘సూర్య48’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















